జాతీయ ఐక్యతకు ప్రతీకగా మెదక్‌లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ, 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం, దేశభక్తి విలువలు బలంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్