రామాయంపేటలో తెలంగాణ ఉద్యమ యోధుడు అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని, నూతన రాష్ట్ర ఆవిర్భావానికి అదే బలమైందని వక్తలు తెలిపారు.