జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు, పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. కుల్చారం కేజీబీవీని సందర్శించి, బోధన, మెనూ, పారిశుధ్యంపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో ‘క్లీనింగ్ యాక్టివిటీ’ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడేది లేదని, అపరిశుభ్రతపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.