ఎన్నికల నియమావళి అమలులో భాగంగా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద SFT బృందం అధికారులు ప్రతి వాహనాన్ని ఆపి పర్యవేక్షించారు. డబ్బులు, మద్యం వంటి నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.