నార్సింగి మండలం శంకాపూర్ లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్ఐ సృజన ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, మట్టి తవ్వకాలు, రవాణాకు వినియోగిస్తున్న ఒక జేసీబీతో పాటు మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తదుపరి చర్యల కోసం రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన అక్రమ మైనింగ్ పై పోలీసుల నిఘాకు అద్దం పట్టింది.