తల్లిని వేధించి, ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు అరెస్ట్

మెదక్ జిల్లా, నిజాంపేట మండలం నస్కల్‌లో శుక్రవారం మద్యం, కొత్త కారు కోసం డబ్బులు ఇవ్వాలని తల్లి రజినిని వేధించి, ఆమె నిరాకరించడంతో దూషించి, దాడి చేసి చంపుతానని బెదిరించి, చివరకు ఇంటికే నిప్పంటించిన గౌతమ్‌రెడ్డిని పోలీసులుశనివారం అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం మద్యం సేవించి తల్లితో గొడవపడటంతో భయపడిన రజిని స్నేహితురాలి ఇంటికి వెళ్లగా అదే రాత్రి 11.30 గంటలకు గౌతమ్‌రెడ్డి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రజిని ఫిర్యాదు మేరకు పోలీసులు గౌతమ్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕