నూతన సంవత్సరం 2026 సందర్భంగా, గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు.