హత్య కేసులో సూరజ్‌కు జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా

మెదక్ జిల్లా మనోహరాబాద్ పరిధిలో 2023 నవంబర్ 19న జరిగిన హత్య కేసులో నిందితుడు సూరజ్‌కు జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో రజిని దేవిని హత్య చేసిన సూరజ్‌పై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన వాదనలతో కోర్టు శిక్ష విధించింది. కేసులో భాగస్వామ్యమైన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్