పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అవమానించారు. విగ్రహం ముఖంపై పేడ కొట్టి, తలపై చెప్పు ఉంచి అపచారం చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు నిరసన తెలిపారు. దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.