మెదక్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు నిర్ణయం తీసుకోవడం హర్షనీయం

మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్