నార్సింగి మండలంలో సోమవారం ఉదయం తాళం వేసి ఉన్న బోండ్ల శ్రీనివాస్ అనే ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడ్డారు. దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బంగారం, నగదును చోరీ చేశారు. శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఉదయం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. బంగారం, డబ్బులు పోయినట్లు గుర్తించారు. ఎస్సై అహ్మద్ మొయినుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.