ఆర్టీసీ బస్సులో చోరీ.. బాధితురాలి ఆవేదన

రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దేవలక్ష్మి అనే మహిళకు చెందిన నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు బ్యాగ్‌లోంచి మాయమయ్యాయి. అక్కన్నపేటలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపారు. బస్టాండ్‌కు చేరుకున్నాక బ్యాగ్ చూడగా బంగారం కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని దేవలక్ష్మి పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్