తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో వ్యక్తి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వడియారం మల్లేశం భార్యా పిల్లలతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేశం ఇంట్లో 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో గురువారం తలుపులు తొలగించి చూడగా మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.