ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్, డా. మురళీధర్ గౌడ్ కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, సభకు యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాలు ఇప్పటికే కాషాయమయమయ్యాయని, రేపటి సభ చరిత్రలో నిలిచిపోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.