ఈదురుగాలుల ప్రభావానికి రహదారిపై కూలిన చెట్లు

నిజాంపేటలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి, రహదారిని పునరుద్ధరించారు. అకాల వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్