చిలిపిచేడు మండలం బద్రియా తండాలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్లు అకాల వర్షాలకు తడిసి ముక్కిపోవడంతో పాటు మొలకలు వస్తున్నాయి. దీంతో రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.