మెదక్ జిల్లాలో వాహనాల తనిఖీలు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి చౌరస్తాలో బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రేణుక మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్సు లేని వారు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణించరాదని, వాహన పత్రాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్