గ్రామ అవసరాలే.. అభివృద్ధి ప్రణాళిక: వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్లాన్‌

నిజాంపేట మండలం రాంపూర్‌లో, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనులను ప్రణాళికలో చేర్చే వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. జిల్లా ప్రత్యేక అధికారి విజయరావు, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో మంగళవారం ఈ ప్రణాళిక తయారీ జరిగింది. పీఆర్‌ఏ విధానంలో నాలుగు కేటగిరీల్లో గ్రామ అవసరాలను గుర్తించి, ఈ ఏడాది, వచ్చే ఏడాది చేపట్టాల్సిన పనులను ప్రణాళికలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, సర్పంచు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕