కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే రామాయంపేట అభివృద్ధి.. ఎమ్మెల్యే

రామాయంపేటలో బుధవారం జరిగిన సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిని సమర్థంగా వివరించి అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్