రైతులకు హెచ్చరిక.. కొయ్యలు తగులబెడితే చర్యలు..వ్యవసాయ అధికారి

పంట కోత తర్వాత వరి కొయ్యలను తగులబెట్టే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హెచ్చరించారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేల సారాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. రైతులు కొయ్యలను కాల్చకుండా, వాటిపై సూపర్ ఫాస్ఫేట్ చల్లి దుక్కి దున్నడం ద్వారా సేంద్రియ పదార్థంగా మార్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్