50 వేల జరిమానాతో హెచ్చరిక.. నస్కల్‌లో మద్యపానానికి నిషేధం

నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ అంజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ. 50 వేల జరిమానా, అక్రమ మద్యం సమాచారం ఇస్తే రూ. 10 వేల బహుమతి ప్రకటించారు. గ్రామ క్షేమం, యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయమని బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్