ప్రభుత్వం సూచనతో పంట మార్పిడి చేసి జొన్నలు సాగు చేసిన రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. జొన్నలు విక్రయించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.