20 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్

పటాన్‌చెరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. కార్మికులు, పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ఈ పాఠశాల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించి ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్