శివంపేట మండలం దొంతి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. తూప్రాన్ నుంచి నర్సాపూర్ పై వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న భర్త వెంకటేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుమలతను తీవ్ర గాయాలు కావడంతో నర్సాపూర్ క్రాంతి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.