కల్హేర్ మండలంలోని బీబీపేటలో శనివారం చిరుత పులి కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడి తిరిగింది. అనంతరం బయటకు వెళ్లి పోయింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గ్రామానికి చెందిన గుండు మోహన్ ఇంటి ఆవరణలో చిరుతపులి తిరగడంతో గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే గ్రామ శివారులో లేగ దూడలను చిరుత పులి దాడి చేసి చంపేసింది. నల్లవాగు పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం.
.