క్రిస్మస్ పండుగపూట సిర్గాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఖాజాపూర్ గ్రామానికి చెందిన రాసాలం సోపాన్ (19) అనే యువకుడు బుధవారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని చర్చి ముందు గల శిలువ జెండా పైపుకు పేయింట్ వేద్దామని తీస్తుండగా, పైన గల విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతిచెoదాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.