పేకాట ఆడుతున్న 9 మంది జూదరులను అరెస్టు చేసినట్లు సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని వాసర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో సిబ్బందితో కలిసి ఎస్ఐ దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.