నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ గ్రామానికి చెందిన ఆవంచ పోచయ్య కాగజ్ మద్దూర్ శివారులోని పెద్ద చెరువులో శవమై తేలిన ఘటన కలకలం రేపింది. చెరువు సమీపంలోని రైతులు ఈ విషయాన్ని గమనించి, గూడెంగడ్డ గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.