ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం నీటి కుంటలో పడి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలు రక్షించి ఆసుపత్రికి తరలించారు. శివంపేట మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన కవితగా గుర్తించారు. తనకు ఎవరూ లేనందున ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్