మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని రెడ్డి పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునితారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలను కల్పించాలని ధాన్యం తూకం వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే రైతు భరోసా చాలా మంది రైతులకు అందలేదని తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.