వెల్దుర్తి పీహెచ్‌సీలో ఏఎన్ఎం రజిని నిద్రమాత్రలు మింగి శనివారం అస్వస్థతకు గురయ్యారు. సహోద్యోగులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పని మార్పు విషయంలో కొంతకాలంగా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.