శివంపేట మండలం గోమారం శివారులోని 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆర్టిజన్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపుతో విధులను పూర్తిగా బహిష్కరించిన కార్మికులు సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశారు.