వెల్దుర్తి రేణుక ఎల్లమ్మ భవాని ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు

వెల్దుర్తిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ భవాని ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం మూడవ మంగళవారం పురస్కరించుకొని శ్రీ రేణుకా భవాని కి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్