చిలిపిచెడులో బతుకమ్మ సంబరాలు: గౌరమ్మకు పూజలు, ఆటపాటలతో నిమజ్జనం

నర్సాపూర్ చిలిపిచెడు మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో బతుకమ్మ వేడుకల చివరి రోజున 'సద్దుల బతుకమ్మ' లేదా 'పెద్ద బతుకమ్మ'గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ గౌరమ్మను పూజించి, గుమ్మడి ఆకులు, రంగులద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర పూలతో బతుకమ్మను పేర్చారు. గుమ్మడికాయ, పుంటి కూర, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, పెరుగన్నం వంటి సద్దులను నైవేద్యంగా సమర్పించి, రాత్రి వరకు ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్