తూప్రాన్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం-7లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. టీచర్ ఇందిరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తల్లులకు, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ముర్రు పాల వల్ల శిశువుకు లభించే పోషకాలు, రోగనిరోధక శక్తి పెరగడం వంటి లాభాలను వివరించారు. ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.