శుక్రవారం, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో యూరియా కొరతపై చర్చించాలని నిరసన తెలిపారు. ఈ నిరసనలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత, ఇతర టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. యూరియా కొరతను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.