బాల్యవివాహాలు జరగకుండా చూడాలి – కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, బాల్యవివాహాలు జరగకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. శివ్వంపేటలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాలు, తండాల్లో ప్రజల్లో అవగాహన కల్పించి బాల్యవివాహాలను అరికట్టాలని ఆయన సూచించారు. పిల్లల చేత పనులు చేయించడం నేరమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హేమ భార్గవి, ఆర్డీవో, తాసిల్దార్, ఐసిడిఎస్ సిబ్బంది, ఎన్‌జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్