శివ్వంపేట: పేదవాడికి ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్

శివ్వంపేట మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా స్వగృహంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఆవుల రాజు రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరంతరం రైతుల, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మందికి 10, 13, 000/- చెక్కులను అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్