గత పది సంవత్సరాలుగా తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.