ఎడ్లబండిపై నామినేషన్.. ఆకట్టుకున్న కాంగ్రెస్ నేత

నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ గుప్తా వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సాధారణ వాహనాలకు బదులుగా ఎడ్లబండిపై భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. రైతులు, రైతాంగ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ విధానం ద్వారా సంకేతం ఇవ్వాలనుకుంటున్నట్లు శ్రీధర్ గుప్తా తెలిపారు. ఈ చర్య ప్రజల దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత పోస్ట్