గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. తహశీల్దార్‌కు వినతి

వెల్దుర్తిలో “గోమాత సమ్మన్ అభియాన్”లో భాగంగా సోమవారం విఠలేశ్వర దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు గోమాత యాత్ర ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ భక్తి వాతావరణంలో సాగి, స్థానికంగా ఆకర్షణగా నిలిచింది. అనంతరం హిందూ సంఘాల నాయకులు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేసి, గోవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. గోమాత పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్