సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శివారులోని హల్దీ వాగులో ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) తూప్రాన్ లో పెళ్లికి వెళ్లి వస్తుండగా సరదాగా స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. నీటి ఉద్ధృతికి ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.