చందంపేటలో నేరుగా ధాన్యం కొనుగోలు

చిన్నశంకరంపేట మండలం చందంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ సంగమేశ్వర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. రైతులు నేరుగా ధాన్యం విక్రయించి మధ్యవర్తుల ఇబ్బందులు తప్పించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో కొనుగోలు జరగడంతో రవాణా ఖర్చు తగ్గి, సమయానికి చెల్లింపులు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్