హత్నూర పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులు పంపే అనుమానాస్పద లింకులను తెరవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.