స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సోషల్ మీడియా వేదికల్లో హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తులను లేదా రాజకీయ పార్టీలను కించపరిచే పోస్టులు చేయవద్దని, అసత్య ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.