కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేట్ వద్ద రైతులు హైవేపై ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు నిల్వ ఉన్నా లారీలు పంపడం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతుందనే ఆందోళనతో రైతులు వెంటనే లారీలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.