చిలిపిచేడ్ మండలం సోమక్కపేట కొనుగోలు కేంద్రంలో భారీ వర్షానికి తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. లారీలు సమయానికి రాకపోవడమే దీనికి కారణమని రైతులు ఆరోపించారు. గురువారం తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి నాణ్యతను కాపాడేందుకు రైతులు ప్రయత్నించారు. కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమవుతోందని, వర్షాల వల్ల మరింత నష్టపోతున్నామని రైతులు వాపోయారు.