సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మున్సిపాలిటీ నల్ల వల్లి గ్రామ పరిధిలో ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు 128వ, రోజు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. వద్దురా నాయన డంపింగ్ యార్డ్ వద్దు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంతవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.