ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

తూప్రాన్ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయి ఉండగా, అకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడేందుకు రైతులు తార్పాలిన్లు కప్పుతూ పరుగులు తీశారు. ఈ వర్షం వల్ల రైతుల కష్టం నీటిపాలవుతుందేమోనన్న భయం వారిని పట్టుకుంది.

సంబంధిత పోస్ట్