నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో ఐదు రోజుల పాటు జరిగిన 5వ ఐఈఈఈ వామ్స్-2026 అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు పరిశోధన, పరిశ్రమ-విద్యా సహకారం, వృత్తిపరమైన అభివృద్ధికి వేదికగా నిలిచింది. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డా. సుధాకర్ రావు స్పెషల్ రికగ్నిషన్ అవార్డు కింద రూ. 1 లక్ష బహుమతిని, బెస్ట్ పేపర్ అవార్డు కింద రూ. 50 వేల నగదును అందజేశారు. మొత్తం 60కిపైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రదానం చేశారు.